PLD: రైతులు అందరూ భాగస్వాములై పంటలను ఎలుకల బారి నుంచి కాపాడుకోవాలని వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో శావల్యాపురం మండలం బొందిలపాలెం గ్రామంలో ఇవాళ నిర్వహించిన సామూహిక ఎలుకల నిర్మూలన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులకు వాటి నిర్మూలన మందులను అందజేశారు.