KMM: ముదిగొండ మండలంలో గ్రంథాలయం శిథిలావస్థలో ఉందని స్థానిక నిరుద్యోగ యువకులు ఇవాళ ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులు బాగుంటేనే దేశం బాగుంటుందన్నారు. గతంలో పలుమార్లు సంబంధిత అధికారులకు వినతి పత్రాలు అందజేసినట్లు తెలిపారు. ఈ శిథిలావస్థలో ఉన్న గ్రంథాలయాన్ని తొలగించి నూతన భవనం నిర్మాణం చేపట్టాలని వాపోయారు.