ఈడెన్ గార్డెన్స్ వేదికగా రేపు భారత్, దక్షిణాఫ్రికా మధ్య తొలి టెస్ట్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మహ్మద్ షమీలాంటి బౌలర్లు లేనప్పటికీ ప్రసిద్ధ్ కృష్ణ, బుమ్రా, సిరాజ్ చక్కగా బౌలింగ్ చేస్తున్నారని తెలిపాడు. రాబోయే టెస్ట్ సిరీస్పై కూడా ఓ కన్నేసి ఉంచామన్నాడు. షమీ ఎంపికపై సెలెక్టర్లే సరైన సమాధానం చెప్పగలరని వెల్లడించాడు.