NLG: కొట్టుకుంటే ఒక్కరే గెలుస్తారని, రాజీ పడితే ఇద్దరూ గెలిచినట్లేనని శాలిగౌరారం ఎస్సై సైదులు అన్నారు. ఇవాళ స్థానిక పోలీస్ స్టేషన్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రాజీ మార్గమే రాజ మార్గమని, లోక్ అదాలత్ ద్వారా సమన్యాయం, సత్వర పరిష్కారం జరుగుతుందని పేర్కొన్నారు. ఈనెల 15న నకిరేకల్ కోర్ట్ నందు నిర్వహించే స్పెషల్ లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.