TPT: రేపు పెళ్లకూరు మండలంలో ‘ప్రజా దర్బార్’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ కార్యాలయం ప్రకటించింది. ఇందులో భాగంగా ఉదయం 10:30 గంటలకు మండలంలోని MPDO కార్యాలయ ప్రాంగణంలో ఈ కార్యక్రమం జరుగనుంది. అయితే మండలంలోని ప్రతి గ్రామ ప్రజలు తమ సమస్యలు, అభ్యర్థనలను నేరుగా ఎమ్మెల్యేకు తెలియజేయడానికి ఈ వేదికను ఉపయోగించుకోవాలని కార్యాలయం పిలుపునిచ్చింది.