కృష్ణా: కౌతవరం గ్రామంలోని పశువుల ఆసుపత్రి సమీప రహదారిపై మురుగునీటి సమస్య తీవ్రంగా మారింది. వర్షం పడినరోజు మాత్రమే నిల్వ ఉండే నీరు, గత నెల రోజులుగా ఎండ, వానతో సంబంధం లేకుండా నిల్వ ఉండి దుర్వాసన వెదజల్లుతోంది. ఈ కారణంగా ఆ మార్గం గుండా వెళ్లే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోజురోజుకు మురుగు నీటి స్థాయి పెరుగుతూ ఉండటంతో రహదారిపై నడవటానికే వీలు లేదు.