ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన కారు బాంబు పేలుడు ఘటనలో మృతుల సంఖ్య పెరిగింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బిలాల్ అనే వ్యక్తి మృతి చెందాడు. దీంతో మృతుల సంఖ్య 13కు చేరుకుంది. కాగా, మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు, శాశ్వత అంగవైకల్యం పొందిన వారికి రూ.5 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.2 లక్షలు చొప్పున ఢిల్లీ ప్రభుత్వ ఎక్స్గ్రేషియా ప్రకటించిన విషయం తెలిసిందే.