ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన కారు బాంబు పేలుడు ఘటనను అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఉగ్రదాడిగా పేర్కొన్నారు. అయితే, ఈ ఘటనపై జరుగుతున్న విచారణలో భారత్కు అమెరికా సహాయం అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. భారత దర్యాప్తు బృందాలు పూర్తి స్థాయిలో వివరాలు సేకరించి, ఈ కేసును ఛేదించగల సామర్థ్యం కలిగి ఉన్నాయని ఆయన నమ్మకాన్ని వ్యక్తం చేశారు.