ఫరీదాబాద్‌లోని అల్ఫలాహ్ యూనివర్సిటీ కేంద్రంగానే ఉగ్ర దాడికి పథకం రచించినట్లు తెలుస్తోంది. వర్సిటీలోని రూమ్ నెం.13 లోనే IED బాంబులు తయారీ చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. డా. ఉమర్, డా. షహీన్, డా. ఆదిల్ కలిసి రూ. 26 లక్షలు సమీకరించి, 20 క్వింటాళ్ల ఎరువులను కొనుగోలు చేశారని.. ఆ ఎరువులతోనే అమ్మోనియం నైట్రేట్ ఆధారిత IEDలు తయారీ చేసినట్లు అధికారులు వెల్లడించారు.