E.G: ఓ వ్యక్తి నుంచి తనకు ప్రాణహాని ఉందని పి.రామశర్మ ఆరోపించారు. గురువారం రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రామకృష్ణకు తాను రూ.4 లక్షలు బాకీ ఉండటం వల్ల తరచుగా వేధించడంతో పాటు, ఇంట్లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని రామశర్మ అన్నారు. ఈ మెరకు తక్షణమే తనకు రక్షణ కల్పించాలని కోరారు.