ADB: బోథ్ మండల కేంద్రంలోని భక్త మార్కండేయ మందిరం నుండి శనివారం రోజు మేల తాళాలు, మంగళ హారతులు, అఖండ జ్యోతి పల్లకి, భజన, భగవన్నామ సంకీర్తనలతో నగర సంకీర్తన ఉంటుందని ఆలయ కమిటీ సభ్యులు పేర్కొన్నారు. మంగళ హారతులతో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమంను విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమం అనంతరం ఆలయంలో మహా అన్న ప్రసాద వితరణ ఉంటుందన్నారు.