KDP: బంగాళాఖాతంలో ఈ నెల 17న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో వచ్చే రెండు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. అయితే దీని ప్రభావం అంత ఎక్కువగా ఉండకపోవచ్చని నిపుణులు చెప్తున్నారు. ఇదిలా ఉండగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గురువారం చలి తీవ్రత పెరిగింది.