నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ నందన్ స్థానిక ఆత్మకూరు బస్టాండు ప్రాంతంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ పనులను గురువారం చేపట్టారు. తరచుగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతున్న ప్రాంతాలలో అందుకు గల కారణాలను నిశితంగా పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇంజనీరింగ్ విభాగం, ఆర్&బి శాఖ, ట్రాఫిక్ పోలీసు శాఖ, నేషనల్ హైవే అథారిటీ అధికారులను కమిషనర్ ఆదేశించారు.