మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా దర్శకుడు సెల్వమణి సెల్వరాజ్ తెరకెక్కించిన మూవీ ‘కాంత’. రేపు విడుదల కాబోతుంది. తాజాగా ఈ మూవీ సెన్సార్ పనులు పూర్తయ్యాయి. దీనికి సెన్సార్ సభ్యులు U/A సర్టిఫికెట్ జారీ చేశారు. ఈ సినిమా రన్ టైం 2:40 గంటలుగా లాక్ అయింది. ఇక 1950ల మద్రాస్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీలో సముద్రఖని, భాగ్యశ్రీ బోర్సే తదితరులు కీలక పాత్రలు పోషించారు.