TG: కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో ఆర్జిత సేవల టికెట్ ధరలను పెంచడంపై కేంద్రమంత్రి బండిసంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఆలయంలో కనీస సౌకర్యాలు లేవు. భక్తుల ఇబ్బందులను పట్టించుకోవడం లేదు కానీ ఇష్టమొచ్చినట్లు ఆర్జిత సేవల టికెట్ ధరలు పెంచారు’ అని మండిపడ్డారు. కాగా పెంచిన ధరలు ఈ నెల 15 నుంచి అమల్లోకి వస్తాయని ఆలయ ఈవో చెప్పిన సంగతి తెలిసిందే.