SKLM: శ్రీకాకుళం ఎమ్మెల్యే గోండు శంకర్ ఆదేశాల మేరకు అరసవెల్లి 26వ డివిజన్లో పారిశుద్ధ్య పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. గురువారం మార్కెట్ వెండింగ్ కమిటీ అడ్వైజర్ సభ్యుడు యు. రమణమూర్తి ఈ పనులను స్వయంగా పరిశీలించి సిబ్బందికి సూచనలు ఇచ్చారు. ప్రజా ఆరోగ్యం దృష్ట్యా నిరంతర శుభ్రత కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.