రిస్క్ ఉన్న పాత్రలను చేసినప్పుడే కెరీర్ మలుపు తిరుగుతుందని నటి అదా శర్మ తెలిపింది. ‘1920’ సినిమాతో పరిశ్రమలోకి వచ్చానని.. తన తొలి సినిమానే పెద్ద సాహోసోపేతమని పేర్కొంది. ‘ది కేరళ స్టోరీ’, ‘బస్తర్: ది నక్సల్ స్టోరీ’ మూవీలు విడుదలైనప్పుడు తనని చంపాలని దేశంలో సగం మంది కోరుకున్నారని వెల్లడించింది. మిగిలినవారు తనని కాపాడారని, తనపై ప్రశంసలు కురిపించారని తెలిపింది.