W.G: భీమవరం మండలం కొవ్వాడలో యువతి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. ఎస్సై వీర్రాజు తెలిపిన వివరాలు ప్రకారం.. హైదరాబాద్కు చెందిన హేమవర్షిని భీమవరంలో బీడీఎస్ చదువుతుంది. మంగళవారం తల్లిదండ్రులు ఫోన్ చేసినా తీయలేదు. స్నేహితులు కొవ్వాడలో ఇంటికి వెళ్లికి చూడగా ఉరివేసుకున్నట్లు గుర్తించి తండ్రి సింహాచలం, పోలీసులకు సమాచారం అందించారు.