MDK: విద్యుత్ తీగలు తెగిపడి రెండు పాడి గేదలు మృతి చెందిన ఘటన నర్సాపూర్‌లో చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాలు.. మండల పరిధిలోని కాజీపేట గ్రామానికి చెందిన పల్లె రమేష్‌కు చెందిన రెండు పాడి గేదెలు గురువారం తన వ్యవసాయ పొలం వద్దకు వెళ్ళగా అప్పటికే వేలాడుతున్న విద్యుత్ తీగలు తెగిపడడంతో అవి అక్కడికక్కడే మృతి చెందాయి.