MDK: రేపు మెదక్ జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న రన్ ఫర్ యూనిటీ విజయవంతం చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు వాలుదాస్ మల్లేష్ గౌడ్ పిలుపునిచ్చారు. నర్సాపూర్ బీజేపీ కార్యాలయంలో గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి ఉత్సవాల సందర్భంగా ప్రధానమంత్రి పిలుపుమేరకు ఈ పాదయాత్ర చేపడుతున్నామని, ఎంపీ రఘునందన్ రావు పాల్గొంటారని తెలిపారు.