AP: సీఎం చంద్రబాబుపై వైసీపీ అధినేత జగన్ విమర్శలు చేశారు. ‘చంద్రబాబు దర్శకత్వంలో నడుస్తున్న క్రెడిట్ చోరీ స్కీం చాలా బాగుంది. 18 నెలల కాలంలో ఒక్క గజం స్థలం సేకరించకుండా.. పైసా కూడా ఖర్చు చేయకుండా ఇళ్లన్నీ మేమే కట్టేశామని ఎలా చెబుతారు? 3 లక్షల ఇళ్లలో ఒక్క ఇంటి పట్టా కూడా మీరు ఇవ్వలేదు. మా హయాంలో 71.8 వేల ఎకరాల్లో 31.9 లక్షల ఇళ్ల పట్టాలను ఇచ్చాం’ అని తెలిపారు.