HYD: చెత్త, వ్యర్థాల నిర్వహణపై దుకాణదారులు, ప్రజలకు జరిమానా వేసే జీహెచ్ఎంసీకి కూడా జరిమానా పడింది. వేస్ట్ మేనేజ్మెంట్ సరిగా పాటించడం లేదంటూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్.. జీహెచ్ఎంసీకి రూ. లక్ష ఫైన్ విధించింది. సిటీలో ఉత్పత్తి అయ్యే చెత్తను ఇష్టానుసారంగా జవహర్‌నగర్‌లో డంపింగ్ చేస్తున్నారంటూ పలువురు ఎన్జీటీని ఆశ్రయించగా ఈ చర్యలు తీసుకుంది.