MDK: రామాయంపేట మండల కేంద్రంలో గురువారం బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ధర్మపోరాట దీక్ష నిర్వహించారు. బీసీలకు విద్య, ఉద్యోగం, చట్టసభల్లో 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ధర్మ పోరాట దీక్ష చేపట్టారు. తెలంగాణ ప్రభుత్వం ఎన్నికలకు ముందు కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు.