NZB: అసాంఘిక కార్యకలాపాలు చేపట్టే వారితోపాటు ఆడపిల్లలను వేధించే వారిపై నిజామాబాద్, కామారెడ్డి పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. పేకాట ఆడినా, ఆడించినా సహించేది లేదని వార్నింగ్ ఇస్తున్నారు. ఇక షీటీమ్లతో ఎక్కడికక్కడ నిఘా ఉందని, అమ్మాయిల జోలికి ఎవరైనా వెళితే తాట తీస్తామని హెచ్చరించారు. జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలు జరిగితే వెంటనే 100కు కాల్ చేయాలన్నారు.