ప్రకాశం: ఒంగోలు నగరంలోని జిల్లా ఉపాధి కల్పనా కార్యాలయంలో ఈ నెల 14వ తేదీన జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారిణీ కె.రమాదేవి తెలిపారు. 18 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్సు కలిగి ఐటీఐ, డిప్లొమా, పదో తరగతి, ఇంటర్, డిగ్రీ అర్హత కలిగినవారు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి గలవారు తమ ధ్రువీకరణ పత్రాలతో హాజరు కావాలని కోరారు.