హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ (264*) చేసి ప్రపంచ రికార్డు సృష్టించి నేటికి సరిగ్గా 11 ఏళ్లు పూర్తయ్యింది. 2014, NOV 13న ఈడెన్ గార్డెన్స్‌లో శ్రీలంకపై రోహిత్ ఈ అద్భుతాన్ని సాధించాడు. ఈ ఇన్నింగ్స్‌లో 173 బంతుల్లో 33 ఫోర్లు, 9 సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. దశాబ్ద కాలంగా ఏ బ్యాటర్ కూడా ఈ రికార్డుకు దరిదాపుల్లోకి కూడా రాలేకపోవడం విశేషం.