JN: రైతులు పత్తి అమ్మకంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కపాస్ కిసాన్ యాప్ గురించి సరిగా తెలియకపోవడం, తెలిసినా అందులో ఫార్మర్ నాట్ రిజిస్టర్ అని చూపించడం, ఎవరి పేరు మీద ఎంత పత్తి ఉందో, ఎంత వరి ఉందో తెలియకపోవడంతో రైతులు సతమతమవుతున్నారు. అప్పుడు రిజిస్టర్ చేసుకొని వారికి వెంటనే రిజిస్టర్ చేసుకునేలా అవకాశం కల్పించాలని కోరుతున్నారు.