NZB: డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన 13 మందికి ఒక్కొక్కరికి రూ. 10 వేల చొప్పున మొత్తంగా రూ. 1,30,000ల జరిమానాలు విధిస్తూ సెకెండ్ క్లాస్ మేజిస్ట్రేట్ నూర్జహాన్ ఇవాళ తీర్పు వెలువరించారని NZB ట్రాఫిక్ CI ప్రసాద్ తెలిపారు. నూతన మోటార్ వెహికల్ చట్టం ప్రకారం రెండోసారి పట్టుబడితే రూ. 15వేల జరిమానా లేదా రెండింటినీ విధించే అవకాశం ఉంటుందన్నారు.