WGL: జిల్లా ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో 9, 10 తరగతులు చదివే అర్హులైన బీసీ, ఈబీసీ విద్యార్థులకు 2025-26 విద్యా సంవత్సరానికి రూ.4,000 ప్రీమెట్రిక్ స్కాలర్షిప్ అందించనున్నట్లు జిల్లా అభివృద్ధి అధికారి నరసింహ ఇవాళ తెలిపారు. తల్లిదండ్రులు, ప్రధానోపాధ్యాయులు డిసెంబర్ 15లోగా https://telanganaepass.cgg.gov.inలో ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు.