MLG: తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క- సారలమ్మ మహాజాతరలో దేవాదాయ శాఖ భక్తులకు కొత్త తరహా సౌకర్యం కల్పించింది. గద్దెల ప్రాంగణంలో హుండీలతోపాటు క్యూఆర్ కోడ్లను ఏర్పాటు చేశారు. భక్తులు స్మార్ట్ఫోన్తో స్కాన్ చేసి హుండీలో కానుకలు చెల్లించవచ్చని దేవదాయ శాఖ అధికారులు తెలిపారు. అయినా నోట్లు, నాణేలతోనే కానుకలివ్వడమే భక్తులకు ఇష్టమని తెలుస్తోంది.