NZB: ఆలూర్ మండల కేంద్రంలో బుధవారం రాత్రి పోలీసు శాఖ ఆధ్వర్యంలో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. అనంతరం సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన సదస్సును ACP వెంకటేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ACP మాట్లాడుతూ.. ప్రజలు సైబర్ మోసాలకు గురికాకుండా జాగ్రత్తగా ఉండాలని, అనుమానాస్పద లింకులు, కాల్స్ కు స్పందించరాదని సూచించారు.