SKLM: సరుబుజ్జిలి మండలం పురుషోత్తపురంకు చెందిన అంపోలు శకుంతల (48) బుధవారం గ్రామ సమీపంలోని చెరువులో మృతి చెందింది. ఈ మేరకు మృతదేహాన్ని గుర్తించిన గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. SI బి.హైమావతి ఘటన స్థలానికి చేరుకుని మహిళ మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్సై తెలిపారు. మృతికి గల కారణాల తెలియాల్సి ఉంది.