కోనసీమ: ఆత్రేయపురం మండలం ర్యాలీలో ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ జగన్మోహిని కేశవ స్వామి దేవస్థానంలో ఇవాళ స్వామివారి దివ్య కళ్యాణం జరుగునుంది. యర్నగూడెం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర భజన మండలి ఆధ్వర్యంలో జరిగే ఈ వేడుకలకు భక్తులు అధిక సంఖ్యలో రావాలని ఆలయ అధికారులు కోరారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 వరకు జరిగే కళ్యాణోత్సవాన్ని లైవ్లో ప్రసారం చేయనున్నారు.