W.G: మొగల్తూరు సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాస్‌కు గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి ఏసీబీ అధికారులమని బెదిరించి రూ. 3 లక్షలు డిమాండ్ చేశారు. శ్రీనివాస్ రూ. 2 లక్షలు పంపగా, మిగిలిన లక్ష రూపాయలు అడగడంతో అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై శుక్రవారం సైబర్ నేరం కింద కేసు నమోదు చేసినట్లు ఎస్సై నాగలక్ష్మి తెలిపారు.