PLD: వినుకొండలోని అన్ని శాఖల అధికారులతో నేడు ఉదయం 10.30 గంటలకు పురపాలక సంఘం కౌన్సిల్ హాలులో పట్టణ స్థాయి సమీక్ష సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఎమ్మెల్యే, చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు పాల్గొంటారు. అన్ని శాఖల అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని ఎమ్మెల్యే కార్యాలయం ఓ ప్రకటనలో సూచించింది.