KRNL: ఆదోని ప్రభుత్వ మాతా శిశు ఆసుపత్రి భవనంపై పెచ్చులు ఊడిపోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ప్రతిరోజూ కాన్పుల కోసం మహిళలు వస్తున్నారని, ఈ ఆసుపత్రి పరిస్థితులు దారుణంగా ఉన్నాయని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల వర్షాలకు పైకప్పు ఊడిపోవడంతో పెచ్చులు జారిపడతాయేమోనని భయపడుతున్నారు. అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.