KDP: గండికోట జలాశయం ముంపు గ్రామాలైన కొండాపురం మండలం కె. బొమ్మపల్లె నిర్వాసితులకు పరిహారం మంజూరు చేస్తూ ప్రభుత్వం బుధవారం ఆదేశాలు ఇచ్చింది. భూమికి సంబంధించిన రూ 3,22,50,000 నిధులను మంజూరు చేస్తున్నట్లు జీవో 2798 ద్వారా తెలిపింది. నిర్వాసితులకు నిధులు ఇస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.