SRD: కంగ్టి మండలం నాగంపల్లి గ్రామంలో గురువారం ఉదయం ఉచిత పశు వైద్య శిబిరాన్ని నిర్వహించారు. మండల పశు వైద్య అధికారి డాక్టర్ సయ్యద్ ముస్తాక్ ఆధ్వర్యంలో గోపాలమిత్ర రాజేందర్ రావు, సిబ్బంది కలిసి 150 పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేశారు. పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు తప్పనిసరిగా వేయించాలని పశు పోషకులు రైతులకు సూచించారు.