భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇవాళ ఒక వింత ఘటన వెలుగులోకి వచ్చింది. మణుగూరు మున్సిపాలిటీ కమలాపురం గ్రామం గుమ్మల రవి ఇంట్లో ఒక చింత చెట్టు ఉంది. అయితే ఎన్నడూ, ఎక్కడా లేని విధంగా ఈ చింత చెట్టు చిటారు కొమ్మన ఒక అల్లిపువ్వు పూసింది. దీంతో గ్రామస్తులు అ పువ్వును చూసేందుకు క్యూ కట్టారు. మునప్పెన్నడూ ఇలాంటి విచిత్రాన్ని తాము చూడలేదని స్థానికులు పేర్కొన్నారు.