KMM: జిల్లా పోలీసులు పోగొట్టుకున్న 30 ఫోన్లను నిన్న వాటి యజమానులకు అప్పగించారు. బాధితులు సీఈఐఆర్ పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయడంతో ఆ ఫోన్లను ట్రాక్ చేసి రికవరీ చేసినట్లు అడిషనల్ డీసీపీ బి.రామనుజం తెలిపారు. ఫోన్లను వెతికి పెట్టేందుకు పోలీసు యంత్రాంగం అత్యాధునిక సాంకేతికతను ఉపయోగిస్తోందన్నారు. ఫోన్లు తిరిగి దక్కడంతో బాధితులు హర్షం వ్యక్తం చేశారు.