‘SSMB29’ చిత్రంలో హీరోయిన్గా నటిస్తున్న ప్రియాంక చోప్రా తాజాగా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించింది. ఈ సందర్భంగా ఆమె తెలుగు నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపింది. అలాగే, హైదరాబాద్ బిర్యానీని ప్రపంచంలోనే అత్యుత్తమ బిర్యానీగా పేర్కొంది. చివరగా, ఆమె నవంబర్ 15న జరిగే ‘Globetrotter’ ఈవెంట్లో కలుద్దామని అభిమానులకు తెలియజేసింది.