NGKL: కల్వకుర్తి పట్టణంలో మార్కెట్లో గురువారం కూరగాయల ధరలు విపరీతంగా పెరిగాయి. బెండకాయ కిలో రూ.100, పచ్చిమిర్చి కిలో రూ.80, టమాట కిలో రూ. 40, దోసకాయ కిలో రూ.60, దీంతోపాటు అన్ని కూరగాయల ధరలు విపరీతంగా పెరిగాయి. ఆకుకూరలు పెద్దకట్ట ఒకటి రూ 20 అమ్ముతున్నారు. ఈ ధరల పెరుగుదలతో వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.