ఆంధ్రప్రదేశ్ నుంచి ఐదేళ్ల క్రితం వెళ్లిపోయిన పునరుత్పాదక ఇంధన సంస్థ రిన్యూ తిరిగి రాష్ట్రానికి రానుంది. గ్రీన్ హైడ్రోజన్, మాలిక్యూల్స్ వంటి హై టెక్నాలజీ రంగాలలో పెట్టుబడి పెట్టనున్నట్లు మంత్రి లోకేష్ తన ట్వీట్లో పేర్కొన్నారు. ఈ క్రమంలో రిన్యూ సోలార్ ఇంగోట్, వేఫర్ తయారీ, ప్రాజెక్ట్ అభివృద్ధి, తదితరాల్లో రూ.82 వేల కోట్ల పెట్టుబడి పెట్టనుంది.