కృష్ణా: చెన్నై – విజయవాడ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు సేవను గుడివాడ జంక్షన్, భీమవరం టౌన్ మీదుగా జనవరి 12వ తేదీ నుంచి నరసాపురం వరకు పొడిగిస్తూ రైల్వే శాఖ నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విస్తరణతో ప్రయాణికులకు వేగవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణం అందుబాటులోకి రానుందని రైల్వేశాఖ అధికారులు తెలిపారు. ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారవేత్తలకు ఇది ఎంతో ప్రయోజనకరం కానుందన్నారు.