TG: చలిగాలుల పంజాకు ఇవాళ రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. ఆసిఫాబాద్(D) లింగాపూర్‌లో కనిష్ఠంగా 6.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే సిర్పూర్లో 7.1, తిర్యానీలో 8.2..ఆదిలాబాద్(D) నేరడిగొండలోనూ 9.5, నిర్మల్(D) సారంగాపూర్‌లో 10.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. రానున్న రోజుల్లో చలిగాలులు మరింత పెరిగి, ఉష్ణోగ్రతలు పడిపోతాయని అధికారులు తెలిపారు.