CTR: అనారోగ్యానికి గురై బోయకొండలో స్వీపర్‌గా పనిచేస్తున్న గంగులమ్మ (52)మృతి చెందింది. వారం రోజులుగా ఆమె తీవ్ర అస్వస్థతకు గురై చికిత్స పొందుతోంది. పరిస్థితి విషమించడంతో మృతి చెందినట్లు మృతురాలి కుటుంబీకులు తెలిపారు. ఈమె బోయకొండలో 25 ఏళ్ల పాటు పనిచేసినట్లు అధికారులు తెలిపారు. ఆమె వృత్తి పట్ల ఈవో ఏకాంబరంతో పాటు సిబ్బంది ప్రగాఢ సంతాపం తెలియజేశారు.