WNP: తెలంగాణ యాసకు ప్రాణం పోసిన ప్రజాకవి కాళోజీ నారాయణరావు అని రాష్ట్ర మహనీయుల స్ఫూర్తివేదిక ఛైర్మన్ రాజారాం ప్రకాష్ అన్నారు. వనపర్తి పాలిటెక్నిక్‌లో కాళోజీ 13వ వర్ధంతిని నిర్వహించి నివాళులు అర్పించారు. “బడి భాష కాదు, పలుకుబడుల భాష కావాలి” అని ఆయన చెప్పేవారని, కేంద్రం ఆయనకు పద్మ విభూషణ్ ఇచ్చి గౌరవించిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు.