NLR: రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యులు కాంతారావు నెల్లూరు జిల్లాలో ఈనెల 13, 14వ తేదీల్లో పర్యటించనున్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పిడిఎస్ దుకాణాలు, ఐసిడిఎస్, మధ్యాహ్న భోజన పథకం అమలు, అంగన్వాడీ కేంద్రాలు, ఎస్సీ, బీసీ సంక్షేమ పాఠశాలలు వసతి గృహాలు తనిఖీ చేయడం జరుగుతుందన్నారు.