KDP: బాలికలపై అసభ్యంగా ప్రవర్తించిన HMను విధుల నుంచి సస్పెన్షన్ చేస్తూ విద్యాశాఖ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. గత నెల 25న మైదుకూరు మండలం కంది మల్లయ్యపల్లె ప్రాథమిక పాఠశాల HM రాధాకృష్ణమూర్తి విద్యార్థినిలతో అసభ్యంగా ప్రవర్తించడంతో DEO శంషుద్దీన్ కు ఫిర్యాదు చేశారు. విచారణ అనంతరం సదరు HMను విధుల నుంచి తొలగించినట్టు MEO పుల్లయ్య తెలిపారు.