BDK: ఎమ్మెల్యే కోరం కనకయ్య ఎంపీడీవో కార్యాలయంలో నిన్న సమీక్ష నిర్వహించారు. ఇళ్ల నిర్మాణ దశలు, లబ్ధిదారులకు బిల్లుల చెల్లింపులు, సాంకేతిక సమస్యలు వంటి కీలక అంశాలపై సమావేశంలో చర్చించారు. మండలంలోని ప్రత్యేక అధికారులు, పంచాయతీ కార్యదర్శులతో మాట్లాడి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పురోగతిపై ఆరా తీశారు. లబ్ధిదారులకు చేరువలో ఉండి సహకరించాలని అన్నారు.